అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్... గంటకు 152 కి.మీ వేగం.. ధర ఎంతంటే!
- ప్రారంభ ధర రూ. 1.50 లక్షలు
- గంటకు 152 కిలోమీటర్ల గరిష్ఠ వేగం
- ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల రేంజ్
- సరికొత్త 4680 బ్యాటరీ, అడాస్ ఫీచర్లు
- కార్బన్ ఫైబర్ భాగాలతో కొత్త స్పోర్టీ డిజైన్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లోకి తన సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. ఎస్1 ప్రో సిరీస్‌లో అత్యంత స్పోర్టీ వెర్షన్‌గా 'ఎస్1 ప్రో స్పోర్ట్' పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అద్భుతమైన వేగం, మెరుగైన రేంజ్‌తో ఈ స్కూటర్ యువతను ఆకట్టుకునేలా ఉంది.
ఈ కొత్త స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే డిజైన్‌లో పలు మార్పులు చేశారు. ఇందులో ఓలా కొత్తగా అభివృద్ధి చేసిన 4680 తరహా బ్యాటరీని అమర్చారు. దీనివల్ల వేగంగా చార్జింగ్ అవడమే కాకుండా, అధిక శక్తిని నిల్వ చేసుకుంటుందని, ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని కంపెనీ పేర్కొంది.
పనితీరు విషయానికొస్తే ఈ స్కూటర్ గంటకు 152 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. కేవలం 2 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఇందులో అమర్చిన 5.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను అందిస్తుందని ఓలా తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఫెర్రైట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది 16 కేడబ్ల్యూ గరిష్ఠ శక్తిని, 71 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డిజైన్ పరంగా ఎస్1 ప్రో స్పోర్ట్‌కు స్పోర్టీ లుక్ ఇచ్చారు. కొత్త సీటు, కార్బన్ ఫైబర్ ఫ్రంట్ ఫెండర్, కార్బన్ ఫైబర్ గ్రాబ్ హ్యాండిల్, ఏరో విండ్‌షీల్డ్ వంటివి అమర్చారు. ముందు భాగంలో కెమెరాను ఏర్పాటు చేశారు. కొలిజన్ డిటెక్షన్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) ఫీచర్ల కోసం ఈ కెమెరాను ఉపయోగించనున్నారు. ఈ ఫీచర్ల కోసం కొత్తగా మూవ్‌వోఎస్ 6 సాఫ్ట్‌వేర్‌ను అందిస్తున్నారు. ఈ స్కూటర్‌కు 14-అంగుళాల వీల్స్‌ను అమర్చారు.