బెల్లంకొండ 'కిష్కిందపురి' టీజర్‌ ఎలా ఉందో తెలుసా?

  • 'కిష్కిందపురి' టీజర్‌ విడుదల 
  • మిస్టీరియస్‌ హారర్‌ థ్రిల్లర్‌గా 'కిష్కిందపురి' 
  • సెప్టెంబరు 12న చిత్రం విడుదల

'భైరవం' తరువాత కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన మరో చిత్రం 'కిష్కిందపురి' విడుదలకు ముస్తాబవుతోంది. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్‌ నాయికగా నటించిన ఈ చిత్రానికి కౌశిక్‌ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టీజర్‌ను గమనిస్తే.. మిస్టీరియస్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది.  

ఒక పాత భవనంలోకి వెళ్లిన ఓ అమ్మాయి ఒక్కసారిగా అదృశ్యం అవుతుంది. అక్కడే రేడియో నుంచి ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభం అనే సందేశం వస్తుంది. కథలో హారర్‌ అంశాలే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. తొలిసారిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ఇది. అయితే గత కొంత కాలంగా హారర్‌ మిస్టరీయస్‌ సినిమాలు ఒకే కథాంశంతో.. రొటిన్‌గా ఉండే అంశాల మేళవింపుతో వస్తుండటంతో ప్రేక్షకాదరణ ఇలాంటి సినిమాలకు ఉండటం లేదు. 

తాజాగా 'కిష్కిందపురి' టీజర్‌ చూస్తుంటే మాత్రం ఈ చిత్రంలో దర్శకుడు నవ్యమైన అంశంతో ఈ చిత్రాన్ని ప్రెజెంట్‌ చేస్తున్నట్లుగా కనిపించింది. చైతన్ భరద్వాజ్‌ నేపథ్య సంగీతం బాగుంది. సో... ఈ టీజర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి...




More Telugu News