చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం: అంబటి రాంబాబు
- చంద్రబాబు, రాహుల్, రేవంత్ హాట్ లైన్ లో ఉన్నారన్న జగన్ వ్యాఖ్యలు నిజమన్న అంబటి
- సిద్ధాంతం, నిబద్ధత లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శ
- దౌర్భాగ్యమైన పాలన చేస్తూ తమపై అభాండాలు వేస్తున్నారని మండిపాటు
నారా లోకేశ్ పై కూడా అంబటి విమర్శలు గుప్పించారు. మీ ఇంటి భూమిపూజకు మీ మేనత్తలను పిలిచారా? అని ప్రశ్నించారు. మీ బాబాయిని మీ నాన్న ఎలా చూశారో అందరూ చూశారని చెప్పారు. మీరు నిజాయతీగా ఎన్నికలు నిర్వహించి ఉంటే... పోల్ అయిన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హాట్ లైన్ లో ఉన్నారని... జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కరెక్ట్ అని అన్నారు. సిద్ధాంతం, నిబద్ధత లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఆయనకు అవసరం అయితే బీజేపీకి వెళతాడని... అటు నుంచి కాంగ్రెస్ వైపు వెళతాడని... అవసరమైతే మళ్లీ బీజేపీ వైపు వెళతాడని మండిపడ్డారు.