Gandhi: రంగారెడ్డి జిల్లాలో 1,500 గాంధీ విగ్రహాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Independence Day Celebrations with 1500 Gandhi Statues in Rangareddy
షార్ట్స్‌లో చూడండి
రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వినూత్నంగా జరిగాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడలోని ఒక పాఠశాలలో 1,500 గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు.

మహాత్ముడి గొప్పతనం, ఆయన విలువలు ఈ తరం చిన్నారులకు తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాఠశాలకు ప్రత్యేక మెమొంటోను అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Go Back to Shorts
Gandhi
Rangareddy district
Independence Day celebrations
1500 Gandhi statues

More Telugu News