తన అసలు పేరు ఏమిటో వెల్లడించిన జగపతిబాబు!
- పలు విషయాలను వెల్లడిస్తూ వీడియో విడుదల చేసిన జగపతిబాబు
- తన అసలు పేరు జగపతిరావు అని వెల్లడి
- 'అంతఃపురం' సినిమాలో తాను దాదాపు చనిపోయానని అనుకున్నానన్న జగపతిబాబు
ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. మరోవైపు 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి యాంకరింగ్ చేస్తున్నారు. ఈ షో ఎల్లుండి (ఆగస్ట్ 17) నుంచి టీవీలో ప్రసారం కానుంది.
తాజాగా యూట్యూబ్ లో జగపతిబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. తన అసలు పేరు జగపతిరావు అని... అయితే, ఇండస్ట్రీలో రావులెక్కువైపోయారని... అందుకే తన పేరును జగపతిబాబుగా మార్చారని తెలిపారు. అందరికీ నోరు తిరగడానికి ఈజీగా ఉంటుందని జగ్గూభాయ్ గా మారిపోయానని చెప్పారు.
'అంతఃపురం' సినిమాలో తాను దాదాపు చనిపోయానని అనుకున్నానని జగపతి బాబు తెలిపారు. డైరెక్టర్ కృష్ణవంశీ సీన్ లో లీనమై కట్ చెప్పలేదని... తాను నిజంగానే పోయాననుకున్నానని చెప్పారు. తన కెరీర్ మొత్తంలో ఆ సినిమాలో క్లైమాక్సే తన ఫేవరెట్ షాట్ అని తెలిపారు. తనకు ఇంకా జుట్టు ఉండటం అదృష్టమని... అది సహజంగానే తెల్లబడిందని, కాబట్టి దానికి రంగు వేయకుండా అలాగే వదిలేశానని చెప్పారు.
తనకు పెద్దగా కోరికలేమీ లేవని... చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటానని అన్నారు. దీనికోసం ప్రతిరోజు ప్రాణాయామం చేస్తుంటానని చెప్పారు.