ముసుగు వేసుకొని మ‌రీ 'కూలీ', 'వార్ 2' సినిమాలు చూసిన నాని.. ఇదిగో వీడియో

  • నిన్న విడుద‌లైన 'కూలీ', 'వార్ 2' 
  • ఒకే రోజు రెండు భారీ చిత్రాలు విడుదల కావడంతో థియేటర్లకు పోటెత్తిన ఫ్యాన్స్‌
  • సాధార‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా థియేటర్లలో సంద‌డి
  • ఈ చిత్రాల‌ను వీక్షించ‌డానికి హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌కు వెళ్లిన నాని
నిన్న బాక్సాఫీస్ వ‌ద్ద‌ రెండు భారీ చిత్రాలు విడుద‌లైన‌ విష‌యం తెలిసిందే. సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్, నాగార్జున న‌టించిన 'కూలీ'తో పాటు హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన 'వార్ 2' చిత్రాలు థియేట‌ర్స్‌లో రిలీజ్‌ అయ్యాయి. ఈ భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో సినీ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఈ సందడిలో సాధార‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా థియేటర్లలో సంద‌డి చేశారు. ఈ రెండు చిత్రాల‌ను చూడ‌డానికి నేచురల్ స్టార్ నాని హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌కు వెళ్లారు.

అయితే, నాని ముగుసు వేసుకొని మ‌రీ ఈ సినిమాల‌ను వీక్షించారు. త‌న‌ని ఎవ‌రు గుర్తు ప‌ట్టకూడ‌ద‌ని ముఖాన్ని పూర్తిగా మాస్క్‌తో క‌వ‌ర్ చేసుకుని క‌నిపించారు. ప్ర‌స్తుతం నానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది. ఇక‌, ప్రస్తుతం నాని.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' అనే మూవీలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి విడుద‌లైన స్పెష‌ల్‌ టీజర్, ఫ‌స్ట్ లుక్ సినీ అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. 


More Telugu News