ఖ‌జానా జ్యువెల‌రీ చోరీ కేసు.. ముగ్గురు నిందితుల అరెస్టు

  • ఈనెల 12న చందాన‌గ‌ర్ ఖ‌జానా జ్యువెల‌రీలో దుండ‌గుల దోపిడీ
  • జ్యువెల‌రీలో సిబ్బందిని తుపాకీతో బెదిరించి చోరీ, ప‌రారీ
  • నిందితుల్లో పుణెలో ఒక‌రిని, బీద‌ర్‌లో ఇద్ద‌రిని అరెస్టు చేసిన పోలీసులు
హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్‌ ఖ‌జానా జ్యువెల‌రీలో చోరీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. పుణెలో ఒక‌రిని, బీద‌ర్‌లో ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు బిహార్‌కు చెందిన‌వార‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈనెల 12వ తేదీన చందాన‌గ‌ర్ ఖ‌జానా జ్యువెల‌రీలో దుండ‌గులు దోపిడీకి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. జ్యువెల‌రీలోని ఉద్యోగిపై కాల్పులు జ‌రిపిన దొంగ‌ల ముఠా చోరీ చేసి ప‌రారైంది.   

నెల రోజుల క్రితం బిహార్ నుంచి న‌గ‌రానికి వ‌చ్చిన దొంగ‌ల ముఠా జ‌గ‌ద్గిరి గుట్ట‌లో మ‌కాం వేశారు. అక్క‌డ ఓ గ్లాసు ప‌రిశ్ర‌మ‌లో ప‌నికి కుదిరారు. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఈ నెల 12న ఆయుధాల‌తో వెళ్లి, జ్యువెల‌రీ సిబ్బందిని బెదిరించి చోరీ చేసిన అనంత‌రం ప‌రార‌య్యారు. ఈ దోపిడీ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. బృందాలుగా ఏర్ప‌డి నిందితుల కోసం గాలించారు. ఈ క్ర‌మంలో తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు.


More Telugu News