సిట్ సీజ్ చేసిన రూ. 11 కోట్లపై నాకు అనుమానాలు ఉన్నాయి: రాజ్ కసిరెడ్డి

  • లిక్కర్ స్కామ్ నిందితులను రిమాండ్ పొడిగించిన కోర్టు
  • కాల్ డేటా రికార్డులను స్వచ్ఛంద సంస్థతో విచారణ జరిపించాలన్న కసిరెడ్డి
  • సిట్ ఆధారాలను ధ్వంసం చేస్తోందని మండిపాటు
ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఈ నెల 26వ తేదీ వరకు వీరి రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను కోర్టు నుంచి జైలుకు తరలించారు. 

కోర్టుకు వచ్చిన సందర్భంగా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులపై విమర్శలు గుప్పించారు. సిట్ సీజ్ చేసిన రూ. 11 కోట్లపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. కాల్ డేటా రికార్డులను స్వచ్ఛంద సంస్థతో విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు. సిట్ ఆధారాలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. 

గతంలో లో కూడా సిట్ అధికారులపై రాజ్ కసిరెడ్డి ఆరోపణలు చేశారు. ఎక్కడో పట్టుకున్న డబ్బును తనకు లింక్ చేసి కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ. 11 కోట్లతో తనకు సంబంధం లేదని గతంలో కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.


More Telugu News