సెల్ఫీ దిగేందుకు వచ్చిన వ్యక్తిని గట్టిగా తోసేసిన జయా బచ్చన్... వీడియో ఇదిగో!

  • ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆవరణలో ఘటన
  • సెల్ఫీ దిగుతున్న వ్యక్తిపై చిందులు తొక్కిన జయ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ప్రముఖ సినీ నటి, సమాజ్ వాది పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో సహనం కోల్పోతున్నారు. ఇటీవల పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతున్న సమయంలో కూడా ఆమె సహనం కోల్పోయారు. తాజాగా ఆమె మరోసారి సహనం కోల్పోయారు. ఆమె సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఒక వ్యక్తిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని సీరియస్ గా పక్కకు తోసేశారు. ఏం చేస్తున్నావ్ నువ్వు? అంటూ ఆ వ్యక్తిపై చిందులు తొక్కారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటన జరిగిన సమయంలో జయా బచ్చన్ పక్కన ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా ఉన్నారు. సదరు వ్యక్తిపై జయ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రియాంక చుట్టూ చూసి ముందుకు వెళ్లిపోయారు. ఆమె వెనకే జయ కూడా వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


More Telugu News