గట్టు వామనరావు దంపతుల హత్య.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు
  • సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదన్న తెలంగాణ ప్రభుత్వం
  • 2021 ఫిబ్రవరి 17న వామనరావు దంపతుల హత్య
తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

మరోవైపు, వామనరావు దంపతుల మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.

న్యాయవాదులైన గట్టు వామనరావు, ఆయన భార్య 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లాలోని కల్వచర్ల వద్ద కారులో వెళుతుండగా దారుణ హత్యకు గురయ్యారు. వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వామనరావు తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది.


More Telugu News