సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసిన‌ ఎన్‌టీఆర్‌.. కార‌ణమిదే!

  • హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘వార్ 2’ 
  • నిన్న హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • కార్య‌క్ర‌మం స‌క్సెస్ కావ‌డానికి స‌హక‌రించిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి థ్యాంక్స్ చెప్ప‌డం మ‌రిచిపోయిన తార‌క్‌
  • ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఈవెంట్ అనంత‌రం సారీ చెప్పిన వైనం
  • ఈ మేర‌కు ప్ర‌త్యేకంగా వీడియో రిలీజ్ చేసిన ఎన్‌టీఆర్‌
బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. దీంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు ఇద్ద‌రు హీరోల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అలాగే ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు.  

ఇక‌, ఈ కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం తార‌క్ క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఓ వీడియో విడుద‌ల చేశారు. ఈ ఈవెంట్ స‌జావుగా జ‌రిగి, గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంలో స‌హ‌క‌రించిన తెలంగాణ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం మ‌రిచిపోయినందుకు సారీ చెప్పారు. ఈ సంద‌ర్భంగా  తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆయ‌న ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. 

ఎన్‌టీఆడ‌ర్ మాట్లాడుతూ.. "ఇందాక ముఖ్య‌మైన విష‌యం చెప్ప‌డం మ‌రిచిపోయాను. న‌న్న క్ష‌మించాలి. ఈవెంట్ స‌జావుగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క గారు, పోలీస్ డిపార్ట్‌మెంట్ అందించిన మ‌ద్ధ‌తుకు పాదాభివంద‌నాలు. ఎంతో బాధ్య‌త‌తో అభిమానుల ఆనందానికి కార‌ణ‌మ‌య్యారు" అని అన్నారు.  


More Telugu News