నాతో ఏ సంబంధం లేకపోయినా...: రాఖీ పండుగ రోజున షర్మిల భావోద్వేగం

  • ప్రేమానురాగాలకు రక్షాబంధన్ ప్రతీక అన్న షర్మిల
  • రాష్ట్రంలోని ప్రతి అన్న, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన షర్మిల
  • వైఎస్సార్ అనే మూడక్షరాల అనుబంధాన్ని సంబంధంగా ఏర్పరుచుకున్నారని భావోద్వేగం
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని బంధాలకన్నా రక్త సంబంధం గొప్పదని... తనతో రక్త సంబంధం లేకపోయినా... వైఎస్సార్ అనే మూడక్షరాల అనుబంధాన్ని సంబంధంగా ఏర్పరుచుకుని తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. 


More Telugu News