అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం .. అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

  • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
  • ‘నీ కోసం నేనున్నాను’ అనే భరోసా కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినమని వ్యాఖ్య 
రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నాచెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ఆయన స్పందిస్తూ.. "నా తెలుగింటి ఆడపడుచులకు, నా ప్రియమైన అక్కాచెల్లెళ్ళకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ 'నీ కోసం నేనున్నాను' అనే భరోసాను కల్పించే శుభ సందర్భమే రాఖీ పర్వదినం. అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం. మీ అందరికీ ఒక అన్నగా మీకు రక్షణ కల్పించి, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది అని ఈ రాఖీ పండుగ సందర్భంగా మరోసారి ప్రకటిస్తున్నాను. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలూ పని చేస్తానని హామీ ఇస్తూ అందరికీ మరొక్కమారు రాఖీ పండుగ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. 


More Telugu News