28 ఏళ్ల కిందట మిస్సింగ్.. కరుగుతున్న మంచు కొండలో బయటపడ్డ డెడ్ బాడీ
- మంచులో కూరుకుపోవడంతో చెక్కుచెదరని మృతదేహం
- మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు
- పాకిస్థాన్ లో ని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఘటన
ఖైబర్ ఫఖ్తుంఖ్వా రీజియన్ లోని కోహిస్థాన్ కు చెందిన నసీరుద్దీన్ 1997 లో తన సోదరుడు కథీరుద్దీన్ తో కలిసి గ్రామం నుంచి పారిపోయాడు. ఓ మంచు కొండ పైనుంచి వెళుతుండగా నసీరుద్దీన్ లోయలో పడిపోయాడు. దీంతో కథీరుద్దీన్, ఇతర కుటుంబ సభ్యులు లోయలో గాలించినా నసీరుద్దీన్ ఆచూకీ లభించలేదు. పైనుంచి పడిపోవడంతో చనిపోయాడని అనుకున్నా కనీసం మృతదేహం కూడా లభించలేదు.
ఈ ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత తాజాగా ఓ మంచు కొండ కరగడంతో నసీరుద్దీన్ మృతదేహం బయటపడింది. చెక్కుచెదరకుండా ఉన్న డెడ్ బాడీ పక్కనే ఉన్న గుర్తింపు కార్డుతో అతనిని నసీరుద్దీన్ గా గుర్తించారు. మంచులో కూరుకుపోవడంతో మృతదేహం పాడవకుండా అలాగే ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, పోలీసుల సాయంతో నసీరుద్దీన్ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.