భారీ వర్షాలతో జలకళ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ వర్షాలతో జలకళ

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్ర రాజధానిని, అంతకు ముందు రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తాజా పరిణామాలతో ఈ ఏడాది ఖరీఫ్ కు తగినంత నీటినిల్వలతో సంవృద్దిగా పంటలు పండే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు సంబరపడిపోతున్నారు.

More Telugu News