కార్మికుల మరణం కలచివేసింది.. గ్రానైట్ క్వారీ ప్రమాదంపై మంత్రి లోకేశ్ విచారం
––
బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలైన ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. రోజు కూలీలు మృతిచెందడం బాధాకరమని అన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి సానుభూతి తెలియజేశారు.