నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని బోటులో వెళ్లి కాపాడిన స్థానికులు.. వీడియో ఇదిగో!
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాంతం కావడంతో హైదరాబాద్ కు చెందిన నలుగురు మిత్రులు విహారయాత్రకు వచ్చారు. పాతళ గంగ వద్ద కృష్ణానదిలో దిగి సరదాగా ఈదులాడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నది లోపలికి వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఇది చూసి మిగిలిన ముగ్గురు మిత్రులు కాపాడాలని కేకలు పెట్టగా సందర్శకులను బోటుపై తిప్పే స్థానికులు స్పందించారు. బోటుతో వెళ్లి నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు.