మళ్లీ కలిసిపోతున్న సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్!
- కశ్యప్‌తో విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించిన సైనా
- తాజాగా మనసు మార్చుకున్న సైనా, కశ్యప్
- కొన్నిసార్లు దూరం సాన్నిహిత్యం విలువను నేర్పుతుందని సైనా పోస్ట్
భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. 35 ఏళ్ల సైనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కశ్యప్‌తో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ "కొన్నిసార్లు దూరం, సాన్నిహిత్యం విలువను నేర్పుతుంది. మేము ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తున్నాం" అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వారి అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తింది.
తన భర్త కశ్యప్‌తో విడిపోతున్నట్టు సైనా నెహ్వాల్ గత నెలలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2018లో వివాహం చేసుకున్న ఈ జంట ఆరు సంవత్సరాలకు పైగా కలిసి జీవించారు. "కొన్నిసార్లు జీవితం మమ్మల్ని వేర్వేరు దిశల్లోకి నడిపిస్తుంది. బాగా ఆలోచించిన తర్వాత మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని సైనా గతంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ బ్యాడ్మింటన్ కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు.