గుజరాత్లో స్వల్ప భూకంపం
- రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదు
- కచ్ జిల్లాలోని బేలాకు నైరుతి దిశలో 16 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం
- ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్న అధికారులు
ఈ స్వల్ప భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా విపత్తుల నిర్వహణ అధికారి వెల్లడించారు. కచ్ జిల్లా భూకంపానికి వెరీ హై రిస్క్ జోన్ అని పేర్కొన్నారు. తక్కువ ప్రకంపనలతో ఇక్కడ తరుచుగా భూంకపాలు సంభవిస్తాయన్నారు. కాగా, 2001లో సంభవించిన భూకంపం వల్ల కచ్‌లో 13,800 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే 1.67 లక్షల మంది గాయపడ్డారు.