ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్ ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు

  • సంజ‌య్‌కు ముంద‌స్తు బెయిల్‌ ఇస్తూ గ‌తంలో హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వులు కొట్టివేత‌
  • అగ్నిమాప‌క విభాగంలో అవినీతి కేసులో సంజ‌య్‌పై ఏపీ ప్ర‌భుత్వం ఎఫ్ఐఆర్
  • ఈ కేసులో ఆయ‌న‌కు ఏపీ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఇచ్చిన వైనం
  • దాంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన ఏపీ ప్ర‌భుత్వం  
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్ ముంద‌స్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇస్తూ గ‌తంలో హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కొట్టివేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అగ్నిమాప‌క విభాగంలో అవినీతి కేసులో సంజ‌య్‌పై ఏపీ ప్ర‌భుత్వం ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. 

ఈ కేసులో ఆయ‌న‌కు ఏపీ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఇచ్చింది. దాంతో హైకోర్టు తీర్పును ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. దీనిపై సుదీర్ఘ వాద‌న‌ల త‌ర్వాత జ‌స్టిస్ ఎన్‌వీఎన్ భ‌ట్టి, జ‌స్టిస్ అమానుతుల్లా ధ‌ర్మాస‌నం ఈ రోజు తీర్పును వెల్ల‌డించింది. ఇక‌, విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ హైకోర్టు తీర్పుపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ముంద‌స్తు బెయిల్ ద‌శ‌లోనే ట్ర‌య‌ల్‌ను పూర్తి చేసిన‌ట్టు ఉంద‌ని మండిప‌డింది. 


More Telugu News