Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్16... విజయవంతంగా కక్ష్యలోకి 'నైసార్'

NISAR Satellite Launched Successfully by GSLV F16
Advertisement
  • నాసా, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం నైసార్
  • నైసార్ ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్16
  • ప్రయోగం విజయవంతమైందన్న ఇస్రో
Advertisement
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ, భారత వాహన నౌక జీఎస్ఎల్వీ-ఎఫ్16 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఈ ఉపగ్రహం బరువు 2,393 కిలోలు. 

నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. ఇందులో ఉండే రెండు భారీ డిష్ ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్ సంకేతాలు పంపుతాయి. ఆ సంకేతాలు భూమిని తాకి పరావర్తనం చెంది తిరిగి శాటిలైట్ ను చేరతాయి. నైసార్ లోని సాంకేతిక వ్యవస్థలు ఆ సంకేతాలను విశ్లేషించి చిత్రాలుగా రూపొందిస్తాయి. 

ప్రకృతి విపత్తులను ఇది ముందుగానే అత్యంత కచ్చితత్వంతో అంచనా వేస్తుందని భావిస్తున్నారు. ఇస్రో అత్యంత చవకగా రాకెట్ ప్రయోగాలు చేపట్టడం గమనించిన నాసా... ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రోతో జట్టుకట్టింది. 
Advertisement
Advertisement
NISAR Satellite
NASA ISRO
GSLV F16
Indian Space Research Organisation
Synthetic Aperture Radar
Earth Observation Satellite
Space Technology
Rocket Launch
Disaster Prediction

More Telugu News