ఇస్రో-నాసా సంయుక్త నిసార్ ఉపగ్రహ ప్రయోగం నేడే!
- నేటి సాయంత్రం 5.40 శ్రీహరికోట నుంచి గంటలకు ప్రయోగం
- మిషన్ విలువ 1.5 బిలియన్ డాలర్లు
- 740 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్ష్యలో చేర్చనున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 రాకెట్
నిసార్ ప్రత్యేకతలు
నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు. ఇది భూమిని డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను (నాసా ఎల్-బ్యాండ్, ఇస్రో ఎస్-బ్యాండ్) ఉపయోగించి మొదటిసారిగా పరిశీలించనుంది. 2,392 కిలోగ్రాముల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్‌కు చెందిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం 740 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్ష్యలోకి చేరుస్తుంది. అక్కడ ఇది ప్రతి 12 రోజులకు భూమి, మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక-రిజల్యూషన్ చిత్రాలతో స్కాన్ చేస్తుంది. ఇందుకోసం స్వీప్‌సార్ టెక్నాలజీని మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు.