రేపు పాకిస్థాన్‌తో సెమీస్‌.. భార‌త్ ఆడుతుందా..?

  • డ‌బ్ల్యూసీఎల్‌లో విండీస్‌ను చిత్తుచేసి సెమీస్‌కు చేరిన భార‌త్‌
  • రేపు పాకిస్థాన్‌తో సెమీస్ పోరు
  • లీగ్ స్టేజీలో దాయాది మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన టీమిండియా
  • ఇప్పుడు సెమీస్‌లో కూడా ఆడ‌కుంటే ఫైన‌ల్‌కు పాక్‌
వెస్టిండీస్ ఛాంపియ‌న్స్‌ను చిత్తుచేసి ఇండియా ఛాంపియ‌న్స్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్ లెజెండ్ (డ‌బ్ల్యూసీఎల్‌) సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌కు చేరాలంటే 14.1 ఓవ‌ర‌ల్లో ల‌క్ష్యాన్ని ఛేదించాల్సి ఉండ‌గా 13.2 ఓవ‌ర్ల‌లోనే గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 144 ర‌న్స్ చేసింది. ఛేజింగ్‌లో టీమిండియా ఆట‌గాళ్లు స్టువ‌ర్ట్ బిన్నీ (50 నాటౌట్‌), శిఖ‌ర్ ధావ‌న్ (25), యువ‌రాజ్ సింగ్ (21 నాటౌట్‌), యూసుఫ్ ప‌ఠాన్ (21) చెల‌రేగి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. లీగ్‌లో ఒకే మ్యాచ్ గెలిచిన‌ప్ప‌టికీ మెరుగైన ర‌న్‌రేట్‌తో ఇండియా ఛాంపియ‌న్స్ సెమీస్‌కు అర్హ‌త సాధించింది. 

రేపు పాక్‌తో సెమీస్ పోరు..
ఇక‌, సెమీస్‌కు దూసుకెళ్లిన భార‌త్ రేపు ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్‌లో సాయంత్రం ఐదు గంట‌ల‌కు (భార‌త కాల‌మానం ప్ర‌కారం) పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డాల్సి ఉంది. లీగ్ ద‌శ‌లో భార‌త ఆట‌గాళ్లు బాయ్‌కాట్ చేయ‌డంతో టోర్నీ మేనేజ్‌మెంట్ పాక్‌తో మ్యాచ్‌ను ర‌ద్దు చేసి చెరో పాయింగ్ కేటాయించింది. ఇప్పుడు సెమీఫైన‌ల్ మ్యాచ్‌నూ ఇండియా ఛాంపియ‌న్స్ బాయ్‌కాట్ చేస్తే పాక్ ఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశ‌ముంది. దీంతో రేపు దాయాదితో భార‌త్ ఆడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.  


More Telugu News