టీటీడీకి విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ దంపతులు

  • విరాళంగా ఇచ్చిన మల్కాజ్‌గిరికి చెందిన కనకదుర్గ ప్రసాద్, సునీత దంపతులు
  • భాస్కరరావు స్ఫూర్తితో విరాళంగా ఇచ్చిన దంపతులు
  • టీటీడీ ఈవోకు పత్రాలు అందించిన కనకదుర్గ ప్రసాద్, సునీత దంపతులు
హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి, వసంతపురి కాలనీకి చెందిన కనకదుర్గ ప్రసాద్, సునీతా దేవి దంపతులు తమ నివాసాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కరరావు స్ఫూర్తితో ఈ దంపతులు తమ ఇంటిని టీటీడీకి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను టీటీడీ ఈవోకు అందజేశారు.

సంతానం లేని ఈ దంపతులు, తమ తదనంతరం 250 గజాల ఇల్లు శ్రీవారికి చెందేలా వీలునామా రాశారు. 

ఇదిలా ఉండగా, మాజీ ఐఆర్ఎస్ అధికారి భాస్కరరావు తన వీలునామా ద్వారా రూ. 3 కోట్ల విలువైన ఇల్లు, రూ. 66 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రస్ట్ ప్రతినిధులు సంబంధిత పత్రాలను టీటీడీ అధికారులకు అందజేశారు.


More Telugu News