డేవిడ్ వార్నర్‌కు అదిరిపోయే గిఫ్ట్ పంపనున్న రాజమౌళి
- వార్నర్‌కు బాహుబలి కీరిటాన్ని గిఫ్ట్‌గా పంపనున్న జక్కన్న
- ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రాజమౌళి పోస్టు
- స్పెషల్ గిఫ్ట్ కోసం ఎదురుచూస్తుంటానని వార్నర్ రిప్లై
ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడి, మనోళ్లకు బాగా దగ్గరయ్యాడు. అదే సమయంలో తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్‌పై ఆయన చేసిన రీల్స్, వీడియోలతో కూడా బాగా ఆదరణ పొందాడు. ముఖ్యంగా 'బాహుబలి' సినిమాపై ఆయన చేసిన వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడీ స్టార్ క్రికెటర్‌కు దర్శకుడు రాజమౌళి బాహుబలి కీరిటాన్ని గిఫ్ట్‌గా పంపనున్నారు.
భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన 'బాహుబలి' పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ మరోసారి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు భాగాలుగా అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఒకే పార్ట్‌గా రానుంది. 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా వార్నర్ తాను గతంలో ధరించిన బాహుబలి కాస్ట్యూమ్ లుక్స్ ను మరోసారి తాజాగా పంచుకున్నాడు. "కీరిటం ఉన్న ఫొటో బాగుందా? లేనిది నచ్చిందా?" అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి జక్కన్న రిప్లై ఇచ్చారు. "హాయ్ డేవిడ్... మీరు ఇప్పుడు మాహిష్మతి సామ్రాజ్యానికి నిజమైన మహారాజులా తయారవ్వండి. నేను ఈ కీరిటాన్ని పంపుతున్నాను" అని అన్నారు. ఈ స్పెషల్ గిఫ్ట్ కోసం ఎదురుచూస్తుంటానని వార్నర్ రిప్లై ఇచ్చాడు. అలాగే "మీరు ఈ సినిమాను ఆస్ట్రేలియాలో మరోసారి చూడండి" అని 'బాహుబలి' టీమ్ కామెంట్ చేసింది. దీనికి వార్నర్ ఓకే అంటూ థంబ్ సింబల్ పెట్టాడు.