లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ టీజర్ విడుద‌ల‌.. అదరగొట్టిన మెగా కోడలు

  • లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘సతీ లీలావతి’
  • ఫ‌న్నీగా మూవీ టీజ‌ర్‌
  • తాతినేని స‌త్య దర్శకత్వం
  • మిక్కీ జే మేయ‌ర్ సంగీతం  
లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రానున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. భీమిలి కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ తెర‌కెక్కించినట్లు టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. 

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కౌంట‌ర్స్‌, స‌ర‌దాగా సాగే పంచ్‌ల‌తో టీజ‌ర్ చాలా ఫ‌న్నీగా ఉంటూ న‌వ్వులు పూయిస్తోంది. లావణ్య, దేవ్ మోహన్ మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టీజర్‌లో చూపించారు. లావ‌ణ్య మ‌రోసారి త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. వ‌రుణ్‌తో పెళ్లి త‌ర్వాత ఆమె న‌టించిన చిత్ర‌మిది. 

నరేశ్‌, వి.టి.వి.గణేశ్‌, సప్తగిరి, జాఫర్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌ మోహ‌న్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వర‌లోనే మేక‌ర్స్ ఈ మూవీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించనున్నారు. 



More Telugu News