వింత ఆచారం.. పూజారికి కారం నీళ్లతో అభిషేకం.. ఎక్కడంటే..!
- తమిళనాడులోని ధర్మపూరి జిల్లాలోని పెరియకరుప్పు ఆలయంలో వింత ఆచారం
- యేటా ఆడి అమావాస్య సందర్భంగా ఆలయ పూజారికి కారం నీళ్లతో అభిషేకం
- ఈసారి 108 కిలోల కారం, 6 కిలోల పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్లతో అభిషేకం
గురువారం ఆడి అమావాస్య రావడంతో 108 కిలోల కారం, ఆరు కిలోల పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్లతో పూజారి గోవింద్‌కు అభిషేకం చేశారు. ఈ ప్రత్యేక అభిషేకంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులకు ఆలయ ప్రాంగణంలో మాంసాహార విందు ఏర్పాటు చేశారు.