హెచ్‌సీఏ బాధ్యతలు జస్టిస్ నవీన్ రావుకు అప్పగింత

  • పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించిన తెలంగాణ హైకోర్టు
  • వరుస అరెస్టుల నేపథ్యంలో అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత
  • హెచ్‌సీఏ అక్రమాల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక కీలక ఉత్తర్వును జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్ రావుకు అప్పగించింది. హెచ్‌సీఏలో వరుస అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ వ్యవహారాలను ఇకపై జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షిస్తారు.

హెచ్‌సీఏ అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రధాన కార్యదర్శి దేవరాజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆ క్లబ్ అధ్యక్షురాలు కవితను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జగన్మోహన్ రావు నకిలీ పత్రాలతో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News