కేంద్రం మౌనం.. ధన్‌ఖడ్‌కు విపక్షాల వీడ్కోలు విందు

  • అనారోగ్య కారణాలతో ఇటీవల ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్‌ఖడ్
  • ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు
  • విందుకు ధన్‌ఖడ్‌కు ఆహ్వానం పలికిన విపక్షాలు
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు ప్రతిపక్షాలు వీడ్కోలు విందు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల దృష్ట్యా ధన్‌ఖడ్ ఇటీవల రాజీనామా చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానిని ఆమోదించారు. అయితే, ఆయన రాజీనామాకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

ఇటీవల జరిగిన బీఏసీ సమావేశంలో ధన్‌ఖడ్‌కు వీడ్కోలు పలకాలని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ డిమాండ్ చేయగా, కేంద్రం ప్రభుత్వం స్పందించలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆయనకు వీడ్కోలు విందు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.


More Telugu News