ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి.. వీడియో ఇదిగో!

Dhavaleswaram Godavari River Flood Fury Video



తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2,16,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మిగతా చోట్ల కూడా ముసురు వాతావరణం నెలకొంది.

రెండు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, నదులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Advertisement
Dhavaleswaram
Godavari River
Godavari floods
Dhavaleswaram Barrage
East Godavari District
Andhra Pradesh rains
IMD warning
Telugu states floods
low pressure in Bay of Bengal
flood alert

More Telugu News