మరాఠీ భాషతో భారతీయ భర్తను సర్‌ప్రైజ్ చేసిన అమెరికన్ భార్య.. ఇదిగో వీడియో!
- భారతీయ భర్త కోసం మరాఠీ నేర్చుకున్న అమెరికన్ భార్య
- భార్య మరాఠీ భాష పలకడం చూసి చిరునవ్వులు చిందించిన భర్త
- నెట్టింట వైరల్‌గా మారిన వీడియో.. నెటిజన్లు కామెంట్స్
భాషలు మన సంస్కృతిని, భావాలను వ్యక్తం చేసే కీలక మార్గాలు. వాటిని నేర్చుకోవడం ద్వారా మనం మరొకరితో మరింత దగ్గరగా ఉండగలుగుతాము. ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకున్న ఒక అమెరికన్ మహిళ, తన భారతీయ భర్త కోసం మరాఠీ భాష నేర్చుకొని అందరి హృదయాన్ని గెలిచింది.
కాండస్ కార్నే అనే అమెరికన్ మహిళ తన భర్త అనికేత్ కార్నేతో మాట్లాడానికి మరాఠీ భాష నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ ప్రయత్నం వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో కాండస్ సంతోషంగా 'శుభ సకాల్, ఎలా ఉన్నావ్?' అని మరాఠీ లో మాట్లాడడం కనిపించింది. మరాఠీ భాషలో ఆమె మాటలు వినగానే భర్త ముఖం చిరునవ్వుతో వెలిగిపోవడం చూడొచ్చు.
కాండస్ తన భర్తతో 'నమస్కార్', 'రాత్రి భోజనానికి ఏమి వుంది?' వంటి వాక్యాలు మాట్లాడటం వీడియోలో ఉంది. భర్త ఆమెకు చికెన్ వండినట్లు చెప్పగానే ఆమె 'ధన్యవాదాలు' అని చెప్పడం కూడా వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కాండస్ కృషి, ప్రేమను ప్రశంసిస్తున్నారు. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
ఒకరు "భార్య మరాఠీ భాషలో మాట్లాడటం వల్ల అతడి చిరునవ్వు మరింత అందంగా కనిపించింది" అని అభిప్రాయపడ్డారు. మరొకరు "ఇలాంటి ప్రయత్నాలు ఇతరులకు కూడా ప్రేరణ" అని పేర్కొన్నారు. "భాషల మధ్య మంచి సంబంధాలు పెంపొందించటం, భిన్న సంస్కృతులను గౌరవించడం కూడా అవసరం. కాండస్ ప్రయత్నం ఈ విషయాన్ని మనతో స్పష్టం చేసింది" అని ఇంకొకరు కామెంట్ చేశారు.