కొల‌ను తవ్వుతుండ‌గా బ‌య‌ట‌ప‌డిన పంచ‌ముఖి శివ‌లింగం

  • యూపీలోని బ‌దాయూ జిల్లాలో ఘ‌ట‌న‌
  • త‌వ్వ‌కాల్లో బ‌య‌ల్ప‌డిన శివ‌లింగం దాదాపు 300 ఏళ్ల కిందటిది కావొచ్చ‌ని అంచనా 
  • పంచ‌ముఖి శివ‌లింగాన్ని చూసేందుకు పోటెత్తిన చుట్టుప‌క్క‌ల‌వారు
యూపీలోని బ‌దాయూ జిల్లా దాతాగంజ్ త‌హ‌సీలు ప‌రిధి స‌రాయ్ పిప‌రియా గ్రామంలో మంగ‌ళ‌వారం కొల‌ను త‌వ్వుతుండ‌గా పంచ‌ముఖి శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. ఇది దాదాపు 300 ఏళ్ల కిందటిది కావొచ్చ‌ని స్థానిక బ్ర‌హ్మ‌దేవ్ ఆల‌య పూజారి మ‌హంత్ ప‌ర‌మాత్మా దాస్ మ‌హరాజ్ తెలిపారు. ఇక‌, ఈ విష‌యం చుట్టుప‌క్క‌ల గ్రామాల వారికి తెలియ‌డంతో పంచ‌ముఖి శివ‌లింగాన్ని చూసేందుకు పోటెత్తారు.  

కొల‌ను త‌వ్వ‌కం స‌మ‌యంలో అక్క‌డే ఉన్న న‌ర్మ‌దా బ‌చావో ఆందోళ‌న్ కార్య‌క‌ర్త‌, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త శిప్రా పాఠ‌క్ మాట్లాడుతూ... త‌న 13 ఎక‌రాల స్థ‌లంలో తామ‌రు కొల‌ను ఏర్పాటుకు ఈ త‌వ్వ‌కాలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఈ స్థ‌లంలోనే పంచ‌త‌త్వ పౌధ్‌శాల పేరిట ఆమె న‌ర్స‌రీని కూడా పెంచుతున్నారు. 

త‌న ఫౌండేష‌న్ ద్వారా యేటా 5 లక్ష‌ల మొక్క‌ల పంపిణీ ల‌క్ష్యంగా పెట్టుకొన్న పాఠ‌క్ శివ‌లింగం ఆవిర్భావాన్ని భ‌గ‌వ‌ద‌నుగ్ర‌హంగా పేర్కొన్నారు. కాగా, శివ‌లింగం ప‌రిశీల‌న‌కు పురావ‌స్తుశాఖ అధికారుల‌ను పిలుస్తామ‌ని దాతాగంజ్ స‌బ్ డివిజ‌న‌ల్ మెజిస్ట్రేట్ ధ‌ర్మేంద్ర కుమార్ సింగ్ వెల్ల‌డించారు.  


More Telugu News