హెచ్‌సీఏ అక్రమాల్లో కేటీఆర్, కవిత ప్రమేయం: టీసీఏ కార్యదర్శి సంచలన ఆరోపణలు

  • పదేళ్ల పాటు రాష్ట్ర క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శ
  • చాలామంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని ఆరోపణ
  • కేటీఆర్, కవిత, సంపత్ కుమార్‌లను విచారించాలని డిమాండ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పదేళ్ల పాటు రాష్ట్ర క్రికెట్ వ్యవస్థను వారు గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. చాలామంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని విమర్శించారు.

హెచ్‌సీఏ అక్రమాలకు సంబంధించి కేటీఆర్, కవిత, సంపత్ కుమార్‌లను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వీరి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీఏలో బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తెలిపారు. గురువారెడ్డి గతంలోనూ కేటీఆర్, కవితలపై ఆరోపణలు చేశారు.


More Telugu News