పిట్‌బుల్ దాడిచేస్తుంటే రక్షించడం మాని నవ్వుతూ చూస్తున్న వ్యక్తి.. వీడియోలు తీసుకున్న జనం!
- మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘటన
- ఆటోలో ఆడుకుంటున్న పిల్లలపైకి కుక్కను వదిలిన యజమాని
- ఆటోలో చిక్కుకుపోయిన బాలుడిపై పిట్‌బుల్ దాడిచేస్తుంటే నవ్వుతూ కూర్చున్న యజమాని
- బాలుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
- పరారీలో పిట్‌బుల్ యజమాని
ఆ వెంటనే శునకం యజమాని సోహైల్ ఖాన్ పిట్‌బుల్‌తో ఆటో ఎక్కాడు. దీంతో పిల్లలందరూ భయపడి పారిపోయారు. అయితే, బాధిత బాలుడు మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఆ తర్వాత కుక్కను వదిలి బాలుడిని భయపెట్టాడు. బాలుడు భయంతో ఏడుస్తూ శునకం బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆటో నుంచి దూకి పరిగెత్తాడు. శునకం అతడిని వెంబడించి పలుచోట్ల కరిచింది.
బాలుడు ఏడుస్తుంటే శునకం యజమాని కానీ, దానిని చూస్తున్న ఇతరులు కానీ రక్షించే ప్రయత్నం చేయకుండా నవ్వుతూ వీడియో తీస్తుండటం వైరల్ అయిన వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై బాలుడి తండ్రి మంఖుర్ద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శునకం యజమాని సోహైల్ ఖాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.