ఏఐని ఓడించిన ప్రోగ్రామర్... అభినందించిన ఓపెన్ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్‌మన్
- జపాన్ లో ఆట్‌కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్
- ఒపెన్ఏఐ కోడింగ్ టూల్ ను ఓడించిన పోలెండ్ ప్రోగ్రామర్
- గుడ్ జాబ్ సైహో అంటూ అభినందించిన శ్యామ్ ఆల్ట్‌మన్
టోక్యోలో జరిగిన ఆట్‌కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2025 హ్యూరిస్టిక్ కాంటెస్ట్‌లో పోలెండ్ కు చెందిన ప్రోగ్రామర్ ప్రజెమిస్వాఫ్ డెబియాక్ అద్భుతం సృష్టించాడు. ఓపెన్‌ఏఐ యొక్క అధునాతన కోడింగ్ టూల్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయంపై ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ప్రశంసలు కురిపించారు. "గుడ్ జాబ్ సైహో" అంటూ డెబియాక్‌ను ఆల్ట్‌మన్ అభినందించారు. డెబియాక్ ను టెక్ ప్రపంచంలో 'సైహో'గా పిలుస్తుంటారు.
ఈ పోటీలో ఓపెన్‌ఏఐ టూల్ రెండవ స్థానంలో నిలిచిందని కంపెనీ కూడా ఎక్స్‌లో ప్రకటించింది. జపాన్‌కు చెందిన ఆట్‌కోడర్ అనే కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ సైట్ ఈ వార్షిక పోటీని నిర్వహించింది, దీనికి ఓపెన్‌ఏఐ కూడా స్పాన్సర్‌గా వ్యవహరించింది.
విజయం సాధించిన డెబియాక్ తన ఆనందాన్ని ఎక్స్‌లో పంచుకుంటూ, "మానవ మేధ ఇప్పటికి నెగ్గింది! నేను పూర్తిగా అలసిపోయాను. గత మూడు రోజుల్లో కేవలం 10 గంటలు మాత్రమే నిద్రపోయాను. విశ్రాంతి తీసుకున్న తర్వాత పోటీ గురించి మరిన్ని వివరాలు పంచుకుంటాను" అని పేర్కొన్నారు. తర్వాత, అతను మరో పోస్ట్‌లో, "ఫలితాలు ఇప్పుడు అధికారికంగా నిర్ధారణ అయ్యాయి. నా ఆధిక్యం 5.5 శాతం నుంచి 9.5 శాతానికి పెరిగింది. ప్రోగ్రామింగ్ పోటీలపై ఇంతమంది ఆసక్తి చూపడం నాకు ఆశ్చర్యంగా ఉంది" అని తెలిపారు.
ఈ విజయం మానవ సృజనాత్మకత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మధ్య జరుగుతున్న ఆసక్తికరమైన పోటీని హైలైట్ చేస్తుంది. మానవ మేధస్సు... ఏఐని అధిగమించగలదని డెబియాక్ విజయం నిరూపించింది.