మరిదితో అక్రమ సంబంధం.. నిద్రమాత్రలు, కరెంట్ షాక్ తో భర్త హత్య!

  • అక్రమ సంబంధం మోజుతో దారుణాలకు పాల్పడుతున్న కొందరు మహిళలు
  • ఢిల్లీలో షాకింగ్ సంఘటన
  • పోలీసుల అదుపులో మహిళ
ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల మోజుతో కొందరు మహిళలు దారుణాలకు తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను కడతేర్చడానికి కూడా వెనుకాడడంలేదు. దిల్లీలోని దోహ్రాలోనూ ఇలాంటిదే ఒక షాకింగ్ సంఘటన జరిగింది. సుష్మిత అనే మహిళ తన భర్త కరణ్ దేవ్‌ను తన మరిది (భర్త సోదరుడు)తో కలిసి హత్య చేసింది. ఈ ఘటన జులై 13న బయటపడింది. తన భర్త విద్యుత్ షాక్‌కు గురయ్యాడంటూ ఆసుపత్రికి తీసుకొచ్చింది. అయితే, పోలీసులు విచారించగా, ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. 

సుష్మిత కొంతకాలంగా తన మరిదితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వీరిద్దరూ కలిసి కరణ్‌ను చంపాలని ప్లాన్ చేశారు. రాత్రి భోజనంలో కరణ్‌కు మత్తు మాత్రలు కలిపారు. అతను స్పృహ తప్పిన తర్వాత, విద్యుత్ షాక్ ఇచ్చి చంపారు. దీన్ని ప్రమాదంగా చూపించాలని ప్రయత్నించారు. కాగా, నిద్ర మాత్రలు ఎంత సమయంలో పనిచేస్తాయో తెలుసుకోవడానికి వారు గూగుల్‌లో కూడా వెతికారు.

సుష్మిత చెప్పిన ప్రకారం, కరణ్ ఆమెను తరచూ కొట్టి, డబ్బు అడిగి, మానసికంగా వేధించేవాడు. అందుకే ఈ హత్యకు పాల్పడినట్లు ఆమె తెలిపింది. పోలీసులు సుష్మితను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.


More Telugu News