థాయ్‌లాండ్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం... కాసేపటికే హైదరాబాద్ తిరిగిరాక!

  • నేటి ఉదయం ఘటన
  • ఉదయం 6.40 గంటలకు ఫుకెట్ బయల్దేరిన విమానం
  • టేకాఫ్ అనంతరం సాంకేతిక సమస్య గుర్తింపు
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX110) శనివారం ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం ఉదయం 6:40 గంటలకు, షెడ్యూల్ కంటే 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా విమానం తిరిగి రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది.

ఈ విమానం ఫుకెట్‌లో ఉదయం 11:45 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. సాంకేతిక సమస్యకు కచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. దీనిపై విమానాశ్రయం లేదా ఎయిర్‌లైన్ అధికారుల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. 

ఇటీవలి కాలంలో విమాన సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాలు తిరిగి మరలడం లేదా అత్యవసర ల్యాండింగ్‌లు చేయడం తరచుగా జరుగుతుండడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వారంలోనే, ఢిల్లీ నుంచి ఇంఫాల్‌కు వెళుతున్న ఇండిగో విమానం కూడా సాంకేతిక సమస్య కారణంగా తిరిగి ఢిల్లీకి మరలిన సంఘటన జరిగింది


More Telugu News