అనంతపురంలో రెండేళ్ల బాలుడి ప్రాణం తీసిన దోసె
––
బాలుడు తింటుండగా దోసె ముక్క గొంతులో ఇరుక్కు పోయింది. దీంతో ఊపిరి ఆడక బాలుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అభిషేక్ హుటాహుటిన కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. కళ్లముందే కుమారుడు మరణించడం చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లాడి కడుపునింపాలని చూస్తే దోసె వాడి ప్రాణం తీసిందని తల్లి అంజనమ్మ రోధించిన తీరు స్థానికులను కలచివేసింది.