హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు

  • జలమయమైన హైదరాబాద్ రోడ్లు
  • రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారుల ఇబ్బందులు
  • తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీనితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కూకట్‌పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, బోయినపల్లి, మారేడ్‌పల్లి, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, తిరుమలగిరి, బేగంపేట, అల్వాల్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి మొదలైన ప్రాంతాల్లో అధిక వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోయింది.

పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకొని అవస్థలు పడ్డారు. తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంది.

భారీ వర్షం కారణంగా వాహనదారుల ఇబ్బందులను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. హైడ్రా సిబ్బంది సైతం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


More Telugu News