విజయవాడలో జంట హత్యల కలకలం
- నగర నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణ హత్య
- ఇద్దరు యువకులను కత్తితో పొడిచి హతమార్చిన రౌడీషీటర్
- గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఘటన
విజయవాడలో జంటహత్యలు కలకలం రేపాయి. నగర నడిబొడ్డున ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులను ఓ వ్యక్తి పొడిచి పరారైనట్లు సమాచారం. రక్తపు మడుగులో పడి ఉన్న రెండు మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటుచేసుకుంది. మృతులు ఇద్దరూ విజయనగరం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. వారు క్యాటరింగ్ పనుల కోసం వచ్చి, అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అద్దె గదుల్లో ఉంటున్నట్లు సమాచారం.
స్థానికుల ద్వారా ఈ జంట హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ రౌడీషీటర్ ఆ ఇద్దరు యువకులను కత్తితో పొడిచి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.