బ్రిటన్ రాజును కలిసిన టీమిండియా పురుష, మహిళా జట్లు

  • లండన్ లోని క్లారెన్స్ హౌస్ లో సమావేశం
  • మూడో టెస్టు హైలైట్స్ చూశానన్న కింగ్ చార్లెస్
  • కింగ్ చార్లెస్ ను కలవడం అద్భుతమైన అనుభవం అన్న గిల్
లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, టీమిండియా పురుషులు, మహిళా క్రికెట్ జట్లు మంగళవారం నాడు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ను కలిశాయి. లండన్ లోని క్లారెన్స్ హౌస్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కింగ్ చార్లెస్ మాట్లాడుతూ... మూడో టెస్టుకు సంబంధించిన హైలైట్స్ ను తాను చూశానని చెప్పారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదో రోజు తొందరగా ఎనిమిది వికెట్లను కోల్పోయినప్పటికీ... చివరకు కేవలం 22 పరుగుల తేడాతో ఓడిపోయిందని అన్నారు.  

టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ మాట్లాడుతూ... కింగ్ చార్లెస్ ను కలవడం ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పారు. ఆయన ఎంతో ఆత్మీయంగా, సౌమ్యంగా మాట్లాడారని అన్నారు. లార్డ్స్ టెస్ట్ గురించి ప్రత్యేకంగా అడిగారని తెలిపారు. తర్వాతి రెండు మ్యాచ్ లలో గెలవాలనే ధీమాతో ఉన్నామని చెప్పారు.


More Telugu News