Savita: ఏపీలో నేత కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ విడుదల

AP Government Releases Thrift Fund for Weavers
  • తొలి విడత త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేశామన్న మంత్రి సవిత
  • 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు వెల్లడి
  • మొత్తం 5,726 మంది నేతన్నలకు లబ్ది చేకూరనుందన్న మంత్రి సవిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్తను అందించింది. నేతన్నలకు సంబంధించిన త్రిఫ్ట్ ఫండ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి సవిత మీడియాకు తెలియజేశారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లను జమ చేశామని తెలిపారు. ఈ నిధుల ద్వారా మొత్తం 5,726 మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు ముందే ఆప్కోకు సంబంధించిన రూ.5 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని మంత్రి సవిత గుర్తు చేశారు. అదే విధంగా డిసెంబర్ నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను కూడా ఆప్కో ద్వారా చెల్లించినట్లు తెలిపారు. ఈ రెండు నెలల వ్యవధిలోనే రూ.9 కోట్లకు పైగా నిధులను నేతన్నలకు అందించామని వివరించారు.

చేనేత రంగ అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. త్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదలపై కూటమి ప్రభుత్వానికి, మంత్రి సవితకు చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. 
Savita
AP Weavers
Thrift Fund
Andhra Pradesh
Weavers Cooperative Societies
AP Minister Savita
Handloom Weavers
AP Government
Weaving Sector

More Telugu News