స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

  • లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
  • 317 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 113 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి చేరడం వంటివి పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమయ్యాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్లు లాభపడి 82,570కి చేరుకుంది. నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 25,195 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.82గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా, బజాన్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర షేర్లు రాణించాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర షేర్లు నష్టాల్లో ముగిశాయి.


More Telugu News