ఆ డ్రగ్స్ కేసులో.. కీలక అధికారి కుమారుడి పాత్రపై ఆరా

  • పల్నాడు డ్రగ్స్ కేసు దర్యాప్తు సాగిస్తున్న ఈగల్ టీమ్
  • ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ కుమారుడి వ్యవహారంపై ఆరా
  • సూర్యతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు
హైదరాబాద్ శివారు కొంపల్లిలోని పల్నాడు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈగల్ టీమ్ ఈ కేసు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పల్నాడు రెస్టారెంటు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సూర్యతో రాహుల్ తేజకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

గత సంవత్సరం నిజామాబాద్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రాహుల్ తేజ పరారీలో ఉన్నాడు. రాహుల్, సూర్య, హర్ష కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. పల్నాడు డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నిన్న హర్ష, మోహన్‌లను రిమాండుకు తరలించారు. అరెస్టయిన వారిలో మోహన్‌ను సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవరావు కుమారుడిగా గుర్తించారు.


More Telugu News