ఆ స్టంట్ చేయొద్దని రాజును హెచ్చరించారు... కానీ అతడు వినలేదు: హీరో విశాల్

  • సెట్ లో స్టంట్ చేస్తూ మృతి చెందిన స్టంట్ మేన్ రాజు
  • కోలీవుడ్ లో తీవ్ర విషాదం
  • స్పందించిన విశాల్
నాగపట్నం జిల్లాలో తమిళ చిత్రం వెట్టువం షూటింగ్ సెట్‌లో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో ప్రముఖ స్టంట్ మేన్ ఎస్‌ఎం రాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన కారు టాప్లింగ్ స్టంట్‌ను ప్రదర్శిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన తమిళ చిత్ర పరిశ్రమలో స్టంట్ కళాకారుల భద్రతకు సంబంధించిన ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న నటుడు విశాల్ ఈ ఘటనపై స్పందించారు. 

"రాజు నాకు గత 20 ఏళ్లుగా తెలుసు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది" అని భావోద్వేగంతో చెప్పారు విశాల్. "అతని కుటుంబానికి సహాయం చేయడం నా బాధ్యత. రాజుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారికి మేము ఎలాంటి సహాయం చేయగలమో ఆలోచిస్తున్నాం" అని తెలిపారు.

"ఈ స్టంట్ సన్నివేశం ఒక పెద్ద యాక్షన్ బ్లాక్‌లో భాగంగా ఉంది, ఇందులో కారు బోల్తా కొట్టే స్టంట్ ఉంది. ఈ స్టంట్‌కు కచ్చితమైన లెక్కలు, భద్రతా జాగ్రత్తలు అవసరం. అయితే, ఈ స్టంట్ చేయవద్దని రాజుకు స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ సూచించారు. ఇది సాధారణ స్టంట్ కాదని, తాను కానన్ బ్లాస్ట్‌తో స్టంట్‌ను పూర్తి చేస్తానని దిలీప్ చెప్పారు. కానీ రాజు వినలేదు. తానే స్వయంగా ఆ స్టంట్ చేస్తానని పట్టుబట్టాడు" అని విశాల్ వివరించారు.

స్టంట్ తర్వాత రాజు ఒంటిపై గాయాలు కనిపించలేదని, కానీ అతనిలో చలనం లేదని విశాల్ తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ అతన్ని మృతుడిగా ప్రకటించారని వివరించారు.


More Telugu News