తిరుపతి రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం... రాయలసీమ, షిరిడి ఎక్స్ ప్రెస్ రైళ్లలో మంటలు!

  • లూప్ లైన్ లో ఉన్న రైళ్లలో ఒక్కసారిగా మంటలు
  • రెండు బోగీలు దగ్ధం
  • భయాందోళనలకు గురైన ప్రయాణికులు
తిరుపతి రైల్వేస్టేషన్‌లో సోమవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లూప్‌లైన్‌లో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. 

ఈ అగ్నిప్రమాదంతో తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రైల్వే అధికారులు ప్రమాద కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.


More Telugu News