136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారి మహిళా రెస్క్యూ బృందం

  • తొలి మహిళా రెస్క్యూ బృందంగా శిక్షణ పొందిన 13 మంది అమ్మాయిలు
  • విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించేలా 14 రోజుల పాటు శిక్షణ
  • ధ్రవీకరణ పత్రాలను అందుకున్న మహిళా రెస్క్యూ టీమ్
136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో పలువురు మహిళలు తొలి మహిళా రెస్క్యూ బృందంగా శిక్షణ పొందారు. సింగరేణిలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సేవలు అందించేలా ఈ మహిళలు సన్నద్ధమయ్యారు. బొగ్గు బావిలోకి నీరు వచ్చినా, విషవాయువు వ్యాపించినా, లేదా ఇతర విపత్కర పరిస్థితులు తలెత్తినా వీరు సేవలు అందించనున్నారు.

13 మంది యువతులకు సింగరేణి యాజమాన్యం శిక్షణ ఇచ్చింది. వీరు 14 రోజుల పాటు కఠోర శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం సింగరేణి సీఎండీ వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు.


More Telugu News