అరుణాచల గిరి ప్రదక్షిణలో యాదాద్రి భువనగిరి జిల్లా భక్తుడు దారుణ హత్య

  • గిరి ప్రదక్షిణ చేస్తున్న తెలంగాణ భక్తుడిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన యువకులు
  • ఘర్షణలో భక్తుడిపై కత్తితో దాడి చేసి యువకులు పరారు
  • నిందితులను గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా, సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ (32) అనే భక్తుడు గిరి ప్రదక్షిణ చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కిందపడిన విద్యాసాగర్ ఆ యువకులతో గొడవకు దిగాడు.

అయితే ఆ యువకులు తీవ్ర ఆగ్రహంతో తమ వద్ద ఉన్న కత్తితో విద్యాసాగర్‌పై దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను సహచర భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ విద్యాసాగర్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు తిరువణ్ణామలైకి చెందిన గుగనేశ్వరన్, తమిళరసన్ అని గుర్తించి అరెస్టు చేశారు. 


More Telugu News