Potluri Durga Nageswara Rao: నిర్మాత పొట్లూరి దుర్గా నాగేశ్వరరావు మృతి

Potluri Durga Nageswara Rao Telugu Film Producer Passes Away
  • నిమ్మకూరుకు చెందిన నిర్మాత దుర్గా నాగేశ్వరరావు కన్నుమూత
  • ఈ నెల 10నే మృతి చెందినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త
  • అమెరికాలో స్థిరపడ్డ నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెలు

విజయవాడ సమీపంలోని నిమ్మకూరుకు చెందిన సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు పొట్లూరి దుర్గా నాగేశ్వరరావు కన్నుమూశారు. పొట్లూరి మరణ వార్తను ఆయన సోదరుడు పొట్లూరి సత్యనారాయణ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీనే ఆయన మృతి చెందినప్పటికీ... ఆయన మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుర్గా నాగేశ్వరరావు వయసు 76 సంవత్సరాలు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని రామంతపూర్ లో కన్నుమూశారు.


దుర్గా నాగేశ్వరరావు ప్రముఖ నిర్మాత పొట్లూరి వెంకట నారాయణ కుమారుడు. ఎన్టీఆర్‌తో వెంకట నారాయణ ‘చిక్కడు - దొరకడు’, ‘శ్రీరామాంజనేయ యుద్థం’ వంటి చిత్రాలు నిర్మించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘కృష్ణలీల’ సినిమాను నాగేశ్వరరావు నిర్మించారు. ఇందులో నందమూరి కళ్యాణ చక్రవర్తి, రమ్యకృష్ణ జంటగా నటించారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నారాయణ పిక్చర్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను పంపిణీ చేశారు. దుర్గా నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు అమెరికాలో స్థిరపడ్డారు.  

Potluri Durga Nageswara Rao
Telugu film producer
Tollywood
Krishna Leela movie
Nandamuri Kalyan Chakravarthy
Ramya Krishna
Sri Lakshmi Narayana Pictures
Telugu cinema news
Producer death
Ravi Raja Pinisetty

More Telugu News