విడాకుల వార్తలపై నయనతార స్ట్రాంగ్ కౌంటర్.. భర్తతో ఫొటో షేర్!

  • భర్త విఘ్నేశ్‌తో విడిపోతున్నారన్న వార్తలపై స్పందించిన నయనతార
  • పుకార్లను ఖండిస్తూ భర్తతో కలిసి దిగిన ఫొటో పోస్ట్
  • మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూస్తే మా రియాక్షన్ ఇదేనంటూ క్యాప్షన్
హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ విడిపోతున్నారంటూ కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారానికి నయనతార ఒకే ఒక్క పోస్టుతో తెరదించారు. తమపై వస్తున్న విడాకుల వార్తలను ఆమె సున్నితంగా ఖండించారు. తన భర్త విఘ్నేశ్‌తో సన్నిహితంగా ఉన్న ఒక ఫొటోను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ "మా గురించి వచ్చే అర్థం పర్థం లేని వార్తలు చూసినప్పుడు మా స్పందన ఇలాగే ఉంటుంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇటీవల నయనతార తన సామాజిక మాధ్యమ ఖాతాలో వైవాహిక జీవితం గురించి పెట్టిన ఒక పోస్టే ఈ ప్రచారానికి కారణమైంది. "తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఓ పొరపాటు. భర్త చేసిన తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు" అనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్టును ఆమె పంచుకున్నారు.

అయితే, పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దానిని తొలగించారు. కానీ, అప్పటికే ఆ స్క్రీన్‌షాట్స్ వైరల్ కావడంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే నయనతార తాజాగా ఫొటో పోస్ట్ చేసి ఆ వదంతులకు ముగింపు పలికారు.


More Telugu News